నా కొడుకుకు చనుబాలు పట్టలేకపోయా : కరీనా

by Shyam |
నా కొడుకుకు చనుబాలు పట్టలేకపోయా : కరీనా
X

దిశ, సినిమా : కరీనా కపూర్ ఖాన్ ఇటీవలే ‘కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో బుక్ రిలీజ్ చేసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పటి అనుభవాలను ఇందులో వివరించిన బెబో.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇందులో భాగంగా పెద్ద కుమారుడు తైమూర్ పుట్టినప్పుడు కొన్నిరోజుల పాటు తనకు చనుబాలు ఇవ్వలేకపోయానని వెల్లడించింది. ఇక రెండో కొడుకు జెహ్‌కు పాలు పట్టడం మాత్రం ఏదో సాధించినట్లుగా ఉంటుందని చెప్పింది.

తైమూర్ పుట్టినప్పటి విషయాలను బుక్‌లో పంచుకున్న కరీనా.. ‘డెలివరీ టైమ్ కన్నా ముందే ఆకస్మికంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. దీంతో 14 రోజులకు పైగా పాలు ఇవ్వలేకపోయా. మా అమ్మ, నర్సు పాలు ఎందుకు రావడం లేదని ఆశ్చర్యపోయేవారు. కానీ జెహ్ పుట్టినపుడు అలాంటి సమస్య ఎదురుకాలేదు. బ్రెస్ట్ ఫీడింగ్ సాధ్యమైంది. నిజానికి మొదటి కాన్పులో మాతృత్వాన్ని సరిగా ఆస్వాదించలేకపోయా. అందుకే వెంటనే రెండో బిడ్డకు జన్మనివ్వాలని డిసైడ్ అయ్యా’ అని చెప్పుకొచ్చింది. కాగా రెండ్రోజుల కిందట తన ఇద్దరు కొడుకుల ఫొటోలు షేర్ చేసిన కరీనా.. ‘నా బలం, నా గర్వం, నా ప్రపంచం.. ఇద్దరు పిల్లలు లేకుంటే మై ప్రెగ్నెన్సీ బుక్ సాధ్యమయ్యేది కాదు’ అని తెలిపింది. ఈ బుక్ ప్రీ ఆర్డర్ లింక్ ఇన్‌స్టా బయోలో ఉన్నట్టు సూచించింది.

Advertisement

Next Story

Most Viewed