పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

by Jakkula Samataha |   ( Updated:2021-02-21 07:38:19.0  )
kareena-kapoor Baby
X

దిశ, సినిమా: బాలీవుడ్ బెబో.. కరీనా కపూర్ ఖాన్ రెండో సారి కూడా మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. శ‌నివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన క‌రీనా ఈ రోజు (ఆదివారం) పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ట్లు బెబో కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా, ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరీనా పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. 2012లో సైఫ్ అలీఖాన్, క‌రీనా క‌పూర్‌ పెళ్లి చేసుకోగా, 2016లో తైమూర్ అలీ ఖాన్ జ‌న్మించారు. కరీనా క‌పూర్ బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘లాల్ సింగ్ చ‌ద్దా’ చిత్రంలో న‌టిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed