డ్రగ్స్ కేసులో ప్రముఖ యాంకర్‌కు నోటీసులు..

by Sumithra |
డ్రగ్స్ కేసులో  ప్రముఖ యాంకర్‌కు నోటీసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ :

డ్రగ్స్ కేసు ఓ వైపు బాలీవుడ్‌తో పాటు సాండల్‌ వుడ్‌ను సైతం షేక్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు అగ్ర కథనాయికలకు నోటీసులు జారీ చేసిన NCB.. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ యాంకర్ అనుశ్రీ నోటీసులు పంపింది.

ఇటీవల డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టి, మరో వ్యక్తిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కిషోర్ శెట్టి పలు కీలక విషయాలు వెల్లడించారు. యాంకర్ అనుశ్రీకి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. ఆమెతో పాటు మరి కొంతమంది పేర్లను కూడా వెల్లడించాడని సమాచారం. దీంతో ఆమెకు పోలీసులు నోటీసులు జారీచేశారు.

గతంలో జరిగిన పలు పార్టీల్లో అనుశ్రీ డ్రగ్స్ తీసుకుందని కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా పాపులర్ యాంకర్ పేరు బయటకు రావడంతో ఈ డ్రగ్స్‌ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళూరుకు చెందిన అనుశ్రీ టీవీ యాంకర్‌గా రాణించడంతో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ బెంగళూరులో స్థిరపడింది. కన్నడ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె యాంకర్‌గా భారీగానే పారితోషికం అందుకుంటోంది. నోటీసులు అందడంపై అనుశ్రీ తాజాగా స్పందించింది. 10 ఏళ్ల కిందట కిశోర్ శెట్టితో కలిసి డ్యాన్స్ చేశానని, అంతే తప్ప అతడితో నాకు అంత పరిచయం ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story