పవన్ రాజకీయాలు చేయలేరు: కన్నబాబు

by srinivas |
పవన్ రాజకీయాలు చేయలేరు: కన్నబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: కుల ప్రస్తావన లేకుండా పవన్ కల్యాణ్ రాజకీయాలు చేయలేకపోతున్నారని మంత్రి కన్న బాబు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ద్రోహం చేస్తే కనిపించలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను, కుటుంబ సభ్యులను అక్రమ కేసులతో వేధించారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ద్వారానే ప్రజలకు మేలు చేకూరుతుందని కన్న బాబు అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ అధినేతగా ఉండి పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం సమంజసం కాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే నచ్చకే పవన్ అనవసరంగా వైసీపీపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

Advertisement

Next Story