- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారెక్కిన కనుకుల.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
దిశ,కంటోన్మెంట్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ సేవాదళ్ కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్ రెడ్డి కారెక్కారు.బుధవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన కనుకుల జనార్దన్ రెడ్డి కార్మిక శాఖ చామకూర మల్లారెడ్డికి స్వయాన బావ కాగా మంత్రి మల్లారెడ్డి తో కలిసి వెళ్లి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనార్దన్ రెడ్డి సుధీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్ర సేవాదళ్ విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ లోని కేజేఆర్ గార్డెన్స్ లో జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.గాంధీ భవన్ టికెట్ల అమ్మకానికి అడ్డగా మారిందని ఆరోపించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీనియర్లకు గౌరవం ఇవ్వడంలేదన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా బయట వ్యక్తులకు టికెట్లను కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ తాజా విధానాలు నచ్చకనే కాంగ్రెస్ పార్టీకి, సేవాదళ్ జాతీయ కోశాధికారి పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. కంటోన్మెంట్ తోపాటు సమీప ప్రాంత బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి తన వంతు సహకారం అందిస్తానని జనార్దన్ రెడ్డి అన్నారు.