గుండు గీయించుకుని.. అదృశ్యమై పోవాలనుకున్నా : కంగనా

by Jakkula Samataha |
గుండు గీయించుకుని.. అదృశ్యమై పోవాలనుకున్నా : కంగనా
X

సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో.. బాలీవుడ్ క్వీన్ ఇప్పటికే ఎన్నో సంచలన కామెంట్లు చేసింది. బాలీవుడ్‌లోని నెపోటిజం వల్లే అతడు చనిపోయాడని చెప్పింది. తాజాగా తాను చేసిన విమర్శలను నిరూపించలేని పక్షంలో పద్మశ్రీ అవార్డును వెనక్కిచ్చేస్తానని చెప్పుకొచ్చిన కంగనా. బాలీవుడ్‌లోని చీకటి కోణాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లేటెస్ట్‌గా ఓ చానెల్‌తో ఇంటర్వ్యూలో కంగనా.. సుశాంత్‌ ఆత్మహత్య, బాలీవుడ్ మాఫియా, నెపోటిజం తదితర అంశాలపై మాట్లాడారు.

‘2016లో నేను నటించిన ఒక చిత్రం మంచి హిట్ అయిన తరువాత 18 బ్రాండ్లకు అంబాసిడర్‌గా సంతకం చేశా. ఓ కేసు విషయంలో.. ఆ బ్రాండ్ల నుంచి నన్ను తొలగించారు. అంతేకాదు నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు. అవన్నీ నన్ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయి. నన్ను నేను చంపుకోవాలని అనుకోలేదు. కానీ ఆ పరిస్థితులు అలా ఉండేవి. అందుకే నేను గుండు గీయించుకొని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నాను. అదృశ్యం కావాలనుకున్నాను. నా దగ్గరకు మా బంధువులు తమ పిల్లల్ని కూడా రానిచ్చే వారు కాదు. పబ్లిక్‌లోనే నన్ను ఎన్నో మాటలు అనేవారు. ఒక ఆడపిల్లగా.. పెళ్లి చేసుకోవాలి, తల్లి కావాలి అనే అప్షన్ కూడా లేకుండా చేశారు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆలోచన కూడా నాలో చచ్చిపోయింది. సుశాంత్‌ను కూడా రేపిస్ట్‌గా చిత్రీకరించారు. దాంతో అతను బీహార్ ఎలా వెళ్లగలుగుతాడు? చిన్న పట్టణాల్లో వాళ్లు డబ్బుకు వాల్యూ ఇవ్వరు. కేవలం మంచిపేరుకు మాత్రమే గౌరవం ఇస్తారు. ఇక్కడున్న వాల్లంతా ఎమోషనల్ రాబందులు. వాళ్లకు వాళ్లుగా చంపరు. కానీ చచ్చిపోయేలా ప్రేరేపిస్తారు. చావు తప్ప మరో మార్గం లేనట్లుగా క్రియేట్ చేస్తారు. ముంబై పోలీసులు ఎందుకు ‘పవర్‌ఫుల్ ఫోర్’‌కు సమన్లు జారీ చేయడం లేదు’ అని కంగనా ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed