- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంగనాకు ఉపశమనం.. వెనక్కి తగ్గిన పోలీసులు
ముంబై: తన వ్యాఖ్యలతో సంచలనంగా మారిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కాస్త ఉపశమనం లభించింది. మత పరమైన మనోభావాలను కంగనా వ్యాఖ్యలతో దెబ్బతీశారనే ఆరోపణలతో అరెస్టు చేయాలని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
తనపై చట్టపరమైన కేసులేమి లేవని కంగనా తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది. రనౌత్ వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన ప్రాథమిక హక్కుకు సంబంధించినదిగా పరిగణిస్తూ, పెద్ద ప్రశ్నకు సంబంధించిన అంశంగా పేర్కొంటూ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న రైతుల ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా పేర్కొంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారని ఓ సిక్కు సంస్థ ఫిర్యాదులో పేర్కొంది.
అయితే కంగనా పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు, ఆమెను అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అని పోలీసులను ప్రశ్నించింది. అయితే గతంలో పంపిన నోటీసులకు స్పందన లేకపోగా, పోలీసు స్టేషన్లో హాజరు కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కోర్టు కంగనాను స్టేషన్ లో ఈ నెల 22న హాజరు కావాలని ఆదేశించింది. దీంతో తదుపరి కోర్టు విచారణ జరిగే వరకు ఆమెను అరెస్ట్ చేయబోమని దర్యాప్తు అధికారి తెలిపారు. కాగా, కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 25కు వాయిదా వేసింది.