‘రుద్రమ దేవి తర్వాత .. మళ్లీ షర్మిల’

by Shyam |
‘రుద్రమ దేవి తర్వాత .. మళ్లీ షర్మిల’
X

దిశ, వెబ్ డెస్క్ : కాకతీయ గడ్డమీద రుద్రమ దేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానని రచయిత కంచె ఐలయ్య అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు ఎవరూ అండగా ఉండకపోయినా తాను అండగా ఉంటానంటూ.. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో షర్మిల ఈ రోజు 72 గంటలు నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే .

ఈ నేపథ్యంలో కంచె అయిలయ్య మాట్లాడుతూ.. సమ్మక్క – సారక్క వారసురాలు షర్మిల అని కొనియాడారు. రాష్ట్ర మహిళలు షర్మిలను ముఖ్యమంత్రి చేస్తారని ఆయ‌న అన‌డం గ‌మ‌నార్హం. తప్పకుండా తెలంగాణ మహిళలు షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తారు అన్నారు. తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఆమె ఉంద‌ని చెప్పారు. అలాగే షర్మిల చేపట్టిన దీక్షకు రచయిత కంచె ఐలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యతో పాటు ప‌లువురు ప్రముఖులు మ‌ద్దతు తెలిపారు.

Advertisement

Next Story