- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేషన్ కలకలం: కరోనా టీకాతో ఆస్పత్రిపాలైన ఏఎన్ఎం
దిశ,వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా కరోనా వ్యాక్సినేషన్ కలకలం రేపుతోంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎం,ఆశా వర్కర్లు అస్వస్థకు గురయ్యారు. గురువారం వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కడుపునొప్పితో పాటు వాంతులతో అస్వస్థతకు గురైన ఏఎన్ఎంను వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థకు గురైన ఏఎన్ఎం బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి సబ్ సెంటర్లో పనిచేస్తున్న సుజాతగా గుర్తించారు. చికిత్స అనంతరం బుధవారం సాయంత్రం ఏఎన్ఎం సుజాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. నాగిరెడ్డిపేట మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ వడ్లూరి భూదేవి ఈ నెల 19 న కోవిషిల్ టీకా వేసుకుంది. టీకా వేసుకున్న 10 నిమిషాలకు కళ్ళు తిరిగి, వాంతులు కావడంతో పాటు విపరీతమైన దమ్ముతో ఇబ్బంది పడింది. వెంటనే ఆమెను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.