- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు మేమున్నాం.. ధైర్యంగా ముందుకెళ్లండి : కలెక్టర్ జితేష్ వి పాటిల్
దిశ, సదాశివనగర్ : ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం సదాశివనగర్ మండలం ఉత్తునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పెద్ద పోతంగల్ ఆరోగ్య కార్యకర్త సావిత్రి పై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ చేయడానికి వెళితే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త సావిత్రి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమెను పరామర్శించిన కలెక్టర్, దాడులకు భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.
దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయవ్వ, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్ర రావు, ఉప సర్పంచ్ శివ పాటిల్, వైద్యాధికారి హరికృష్ణ, డిప్యూటీ డీఎం హే వాచ్‌వో శోభారాణి, పంచాయతీ కార్యదర్శి దేవి సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.