- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కమల్ నాథ్?
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు గాంధీలతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయిన తర్వాత ఆ పార్టీలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పూర్తికాలం అధ్యక్షులు లేకపోవడంతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ వచ్చే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమై ఆయనను అధ్యక్షులుగా నియమిస్తూ స్పష్టమైన నిర్ణయం తీసునే అవకాశం ఉందని తెలిసింది. ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసానికి చేరుకున్న కమల్ నాథ్ కొద్దిసేపు ఆమెతో చర్చించారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభలో ప్రస్తుతం ఫ్లోర్ లీడర్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌదరిని అదే బాధ్యతల్లో కొనసాగించనున్నది పార్టీ నాయకత్వం. రాహుల్ గాంధీకి ఆ బాధ్యతలు అప్పజెప్పాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ సూచించడం, పలువురు సీనియర్ నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉండడంతో మార్పు ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ విషయంలో ఎలాంటి మార్పు చేయకుండా పార్టీ నాయకత్వం విషయంలో మాత్రమే కమల్ నాథ్ లాంటివారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది.