- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమల్ మేనిఫెస్టో విడుదల.. హామీలు ఇవే!
దిశ,వెబ్ డెస్క్: సినీ నటుడు కమల్ హాసన్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు లో ఇప్పటీకే నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన కమల్ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ని కమల్ విడుదల చేసారు. ఈ మేనిఫెస్టోలో పలు ఆసక్తికరమైన అంశాలను జోడించారు. కోయంబత్తూరు నుండి పోటీ చేస్తున్న ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, 50 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పిస్తామని తెలిపారు. ఇక యువత ఏ రంగంలో ఐతే ఎదగాలని కోరుకుంటుందో వారికి ప్రోత్సహం అందిస్తామని హామీ ఇచ్చింది.
అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే తమిళనాడులో మోనో రైళ్లను ప్రారంభిస్తామని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడతామని మేనిఫెస్టోలో తెలిపారు. ఇక మహిళలు ప్రతినెలా రూ.10 వేలు నుండి 15 వేలు సంపాదించుకొనేలా వివిధ రంగాలలో వారికి నైపుణ్యం అనేదెలా శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కమల్ పార్టీ 234 స్థానాల్లో పోటీ చేస్తుంది.