రోజు 14 కిలోమీటర్లు పరుగెత్తేవాణ్ణి : కమల్ హాసన్

by Shyam |
రోజు 14 కిలోమీటర్లు పరుగెత్తేవాణ్ణి : కమల్ హాసన్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కష్ట కాలంలో ప్రజలందరిని అప్రమత్తం చేసేందుకు విశ్వనటుడు కమల్ హాసన్ స్వయంగా పాట రాసి పాడారు. అంతేకాదు ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే చాలాసార్లు ఆయన సూచించిన విషయం మనకు తెలిసిందే. కరోనా కాలంలో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను అభిమానులతో, ప్రజలతో పంచుకోవడానికి ఆన్ లైన్ ను వేదికగా చేసుకున్నారు. తాజాగా లోక నాయకుడు కమల్‌హాసన్, వెర్సటైల్ యాక్టర్ విజయ్‌ సేతుపతి ఆన్ లైన్ వేదికగా లైవ్‌ ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. సినీ పరిశ్రమలలో తమ అనుభవాలను ఇరువురు తమ అభిమానులతో పంచుకున్నారు. ఆ సందర్భంగా ఆహారం విష‌యంలో తనను తాను నియంత్రించుకోలేనని, తనకు నచ్చినంతా తింటానని కమల్ చెప్పుకొచ్చారు. తన ఆహారం గురించి తనకంటే తనకు దగ్గరి వాళ్లు బాగా వివరిస్తారని కమల్ చెబుతున్నారు. ఓ సారి తన తిండి చూసి శివాజీ సర్ షాక్ అయ్యారని తెలిపారు. ఈ క్రమంలో తన ఫిట్ నెస్ రహస్యం గురించి ముచ్చటించారు. గతంలో సరైన శరీరాకృతి కోసం రోజుకు 14 కిలోమీటర్లు పరుగెత్తేవాడినని , కానీ ఓ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అంత దూరం పరుగెత్తలేకపోతున్నాని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 90ల్లో సంచలన ప్రాజెక్టుగా నిలిచిన ‘మరుదనాయగం’ ప్రస్తావనను విజయ్‌ సేతుపతి తీసుకొచ్చారు. అందుకు కమల్‌ బదులిస్తూ, ‘మరుదనాయగం’కు భారీ బడ్జెట్‌ అవసరమవుతుందని, ముఖ్యంగా తాను ‘మరుదనాయగం’ కథ రాస్తున్నప్పుడు 40 ఏళ్ల వ్యక్తిలా ఆలోచించానని, ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే కథ మార్పులు చేయాలని లేదంటే మరో హీరోతో తెరకెక్కించాల్సి వుంటుందని పేర్కొన్నారు.

tags: kamal haasan, vijay sethupathi, online chat

Advertisement

Next Story

Most Viewed