- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీలో తిరుగుబాటు.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్న ప్రముఖ నేత
దిశ, ఏలూరు: ఉండి తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగిరింది. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) టీడీపీ రెబల్ గా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు భంగపడ్డారు. గత 20 రోజులుగా ఆయన టీడీపీ అధిష్టానంతో ఎన్నిసార్లు చర్చలు చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది. మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పక్కన పెట్టి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది.
ఇక వైసీపీ శివను పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే శివ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పివిఎల్ నరసింహ రాజు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే టీడీపీ తీరుకి అసంతృప్తికి గురైన ఆయన రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా గత ఎన్నికల్లో టీడీపీ నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా శివ పోటీ. చేసి ఓడిపోయానని. ఆ తర్వాత తనను పార్టీ పట్టించుకోలేదని, అసెంబ్లీ టికెట్ అడిగితే పార్లమెంట్ సీటు ఇస్తామన్నారని చివరకి ఏదీ ఇవ్వలేదని పలుమార్లు శివ వాపోయిన విషయం అందరికి తెలిసిందే.
ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం జైన దేవాలయం నుండి ర్యాలీ నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయనకు భారీ సంఖ్యలో మహిళలు పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజవర్గంలో ఏ ఇంటికి వెళ్లిన తనకు ఘన స్వాగతం పలుకుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఉండితో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పని చేశానని,మరలా ఉండి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి తెలిపిన పట్టించుకోలేదని వాపోయారు. ఉండి ప్రజల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.