- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
3 సార్లు కారు ఎక్కించి కార్పొరేటర్‌ను చంపేశారు
దిశ,వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, 9వ వార్డు కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి ఆర్డీవో ఆఫీసు దగ్గర రమేష్ పై మూడు సార్లు కారు ఎక్కించి హతమార్చారు దుండుగులు. దీంతో రమేష్ మృతి చెందారు. పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కార్పొరేటర్ హత్యతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాకినాడ డీఎస్పీ భీంరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సూర్య వాటర్ సర్విసింగ్ సెంటర్ వద్ద కంపర రమేష్, అతని స్నేహితులు ముత్యాల సతీష్, వాసు మద్యం సేవించారు. అదే సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేష్ ఫోన్ చేయడంతో ఆయన తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. తన తమ్ముడి పుట్టిన రోజు అని.. కేక్ కటింగ్ పార్టీకి రావాలని చిన్నా రమేష్ ఆహ్వనించారు. అయితే రమేష్ తిరస్కరించారు. తర్వాత ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కారు తాళాల విషయంలో చిన్నా, రమేష్ మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్‌ను చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన రమేష్‌ను ట్రస్ట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
2000లో రాజకీయాల్లోకి
కంపర రమేష్ 2000 సంవత్సరంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రమేష్ విజయం సాధించారు. అనంతరం 2005లో కార్పొరేటర్‌గా రమేష్ గెలుపొందారు. 2007లో 9వ వార్డు కార్పొరేటర్‌గా రమేష్ ఎన్నికయ్యారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఇదివరకు ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1992లో ఎన్‌ఎస్‌యూఐ కాకినాడ నగర అధ్యక్షుడిగా, 1995లో తూర్పు గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పని చేశారు. 2000లో కాకినాడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా కొనసాగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువాను కప్పుకున్నారు.