- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచదార బొమ్మ పెళ్లి ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్:
అందాల చందమామ కాజల్ అగర్వాల్ వధువుగా మారబోతుంది. వరుడు ‘గౌతమ్ కిచ్లూ’తో ఏడడుగులు వేయబోతుంది. ఆప్త మిత్రులు, సన్నిహిత బంధువుల నడుమ ముంబైలో అక్టోబర్ 30న జరిగే కార్యక్రమంలో మూడుముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కాజల్.. గౌతమ్‌తో లైఫ్ షేర్ చేసుకోబోవడం థ్రిల్‌గా ఉందని చెప్పింది. ఇన్నాళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన కాజల్.. తను స్టార్ట్ చేయబోయే ఈ గొప్ప ప్రయాణానికి ఆశీర్వచనాలు కావాలని కోరింది. పెళ్లి తర్వాత కూడా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తానని తెలిపింది కాజల్. అన్ ఎండింగ్ సపోర్ట్ ఇస్తున్నందుకు థాంక్స్ చెప్పింది.
మొత్తానికి కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజం కాగా.. అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. గౌతమ్‌తో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. కాగా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ‘ఇండియన్ 2, ఆచార్య’తో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తోంది. పెళ్లి తర్వాత జరగబోయే షూటింగ్‌లకు హాజరు కానుంది ఈ పంచదార బొమ్మ.
https://www.instagram.com/p/CF_boUwHquE/?igshid=8kzincf6dffj