పంచదార బొమ్మది మంచి నిర్ణయమే!

by Jakkula Samataha |
పంచదార బొమ్మది మంచి నిర్ణయమే!
X

అందాల చందమామ కాజల్ అగర్వాల్ 13 ఏండ్లుగా సౌత్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. కొత్త తరం ఎంట్రీ ఇచ్చినా సరే ఈ పంచదార బొమ్మకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఇండియన్ 2, హే సినామిక చిత్రాలు చేస్తున్న కాజల్… తెలుగులో తేజ దర్శకత్వంలో అలమేలుమంగ వెంకటరమణ సినిమాలోనూ చేస్తున్నట్లు సమాచారం. వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న కాజల్.. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చక్కని అవకాశం ఇచ్చేందుకు రెడీ అయిందట. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఇప్పటికే చాలా లాస్ అయింది. దీంతో నిర్మాతల బాధలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది నటీనటులు రెమ్యునరేషన్ తగ్గించారు. ఈ క్రమంలోనే కాజల్ కూడా తన రెమ్యునరేషన్ ఏకంగా రూ. 50 లక్షలు తగ్గించిందట. సినిమాకు రూ. 2 కోట్లు డిమాండ్ చేసే కాజల్.. రూ. 1.5 కోట్లకు రెమ్యునరేషన్ తగ్గించిందని తెలుస్తుంది. ఈ నిర్ణయంతో కాజల్‌కు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

Advertisement
Next Story

Most Viewed