- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెరిట్ విద్యార్థులకు ట్యాబ్‌లు బహుకరించిన కడియం ఫౌండేషన్
దిశ, స్టేషన్ ఘన్‌పూర్: చదువులలో మెరిట్ సాధిస్తూ జాతీయ మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన జనగామ జిల్లా చిల్పూర్ మండలం చినపెండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ కడియం కావ్య ట్యాబ్ లను ఆదివారం బహూకరించారు. స్కాలర్ షిప్ కు ఎంపికైన రోహిత, మేఘన, నిహారిక, గణేష్ లను ఫౌండేషన్ పక్షాన డాక్టర్ కావ్య అభినందించారు. హన్మకొండ ఎక్సైజ్ కాలనీలోని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులలో ప్రతిభను వెలికితీయడానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా నిలుస్తున్నాయని, గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ విజ్ఞానాన్ని ఇనుమడించుకోవటానికి పోటీ పరీక్షలు ఉపకరిస్తాయని డాక్టర్ కావ్య అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొత్తం 20 మంది జాతీయ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారని వారందరికీ కడియం ఫౌండేషన్ పక్షాన ప్రోత్సాహాం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కడియం ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ నజీర్ పాల్గొన్నారు.