హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి ప్రమాణం

by srinivas |
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి ప్రమాణం
X

దిశ, ఏపీబ్యూరో : ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌ మల్య బాగ్చి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే జేకే మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి ఇంతకుముందు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మరోవైపు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అయ్యారు.

సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులిచ్చింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబరు 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి బుధవారం ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story