జూన్ 2న ‘పీపుల్స్ డిమాండ్స్ డే’: వామపక్షాలు

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ‘ పీపుల్స్ డిమాండ్ డే’ గా బహిరంగసభ నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించాయి. శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు, ఉపాధి కూలీలు, ఉద్యోగులు, ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ పంటల ప్రణాళిక, పోడుభూములు పై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానంగా మూడు అంశాలను తీర్మానించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్‌కు వేతనంలో కోత విధించాడాన్ని ఖండిస్తూ పూర్తి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హరితహారం పేరుతో పేద గిరిజనులు సాగుచేస్తుకుంటున్న పోడు భూములను బలవంతంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ ప్రతిఘటిస్తున్న పేద గిరిజనుల పై నిర్భందాన్ని ఖండించారు. కరోనా విపత్కర సమయంలో సాయిబాబు, వరవరరావు, రాజకీయ ఖైదీలందరినీ పెరోల్ లేదా బెయిల్ పై విడుదల చేయాలని సమావేశంలో వామపక్షాలు తీర్మానించాయి. ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి, పోటు రంగారావు, తాండ్ర కుమార్, కె గోవర్ధన్, మురహరి, జానకిరాములు, డి రాజేష్, బి సురేందర్‌రెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed