కౌంటింగ్ అప్‌డేట్ : తెరుచుకున్న జంబో బ్యాలెట్ బాక్స్‌లు

by Anukaran |   ( Updated:2021-03-17 01:35:27.0  )
Ballot Boxes Open
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొమ్మిది జిల్లాల పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బండిల్స్ గా కట్టారు. ఈ ఎమ్మెల్సీ స్థానంలో 600 పైగా ఓట్లను 25 బండిల్స్ చేశారు.

Jumbo Ballot Boxes

ఉదయం 11.30 గంటల తర్వాత అధికారులు జంబో బ్యాలెట్ బాక్స్ లను తెరవడం ప్రారంభించారు. 5,31,685 మంది ఓటర్లు ఉండగా, 3,57,354 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియ 8 హాళ్లలో ఏడు టెబుళ్ల చొప్పున 56 టేబుళ్ల మీద జరుగుతోంది. ఇద్దరు కౌంటింగ్ సిబ్బంది, ఒక మైక్రో పరిశీలకుడుతో సహా మొత్తం 224 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతోంది. బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు, పోస్టల్ ఓట్లు అన్ని కలిపే లెక్కించనున్నారు. అయితే ముందుగా అనుకున్న మేరకు ఫలితాలు అంత తొందరగా తెలకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed