- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేసులో జడ్జి రామకృష్ణ అరెస్ట్
దిశ, ఏపీ బ్యూరో : జడ్జి రామకృష్ణను శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. రామకృష్ణ పిన్నమ్మ చనిపోయిన తర్వాత కూడా ఆమె పింఛన్ను ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో జడ్జి రామకృష్ణ, ఆయన సోదరుడు రామచంద్రపై దుండగులు దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే దాడి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, దళిత సంఘాలు ఖండించాయి.
ఈ నేపథ్యంలోనే జడ్జి రామకృష్ణ రోడ్డుపైకి రావద్దని తహసీల్దార్ నిషేధం విధించారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. గతంలో జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బీ కొత్తకోట పోలీసులు తీసుకెళ్లారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు ఆధారంగా రామచంద్రను విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. భూ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగా కావాలనే ఈ కేసులో మహిళలను రప్పించి అక్రమంగా కేసులు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు.