- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నికర నష్టం రూ. 561 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రూ. 561 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,028 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత మొత్తం ఆదాయం 40.29 శాతం తగ్గి రూ. 11,914 కోట్లకు చేరుకుంది. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా తొలి త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని, సరఫరా గొలుసు పరిమితులు మధ్య కొనసాగిందని, వలస కార్మికులు లేక శ్రామిక శక్తి కూడా ప్లాంట్ల ఉత్పత్తిపై అధికంగానే ప్రభావం చూపిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మే, జూన్ నెలల్లో సడలింపుల మధ్య కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవడంతో సామర్థ్య వినియోగం 80 శాతానికి చేరుకుందని కంపెనీ తెలిపింది. ఇక, స్వతంత్ర ప్రాతిపదికన కంపెనీ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,439 కోట్ల నికర లాభాలతో పోలిస్తే ఈసారి రూ. 146 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిందని కంపెనీ వెల్లడించింది.