‘జోగులాంబ చరిత్ర’ సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

by Shyam |
‘జోగులాంబ చరిత్ర’ సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వాల్మీకి రాముడు ప్రొడక్షన్స్ సారథ్యంలో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘జోగులంబ చరిత్ర’ సినిమా వాల్ పోస్టర్‌ను శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అష్టాదశ ఆది పరాశక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ దేవి విశిష్టతను తెలియజేసేలా ఈ సినిమాను రూపొందించిన దర్శక నిర్మాతలను ఎమ్మెల్యే బండ్ల అభినందించారు.

రానున్న రోజులలో ప్రజలకు మంచి సందేశం ఇచ్చే సినిమాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, నేతలు వెంకటేశ్వర్ రెడ్డి, శేషంపల్లి నరసింహులు, జాకీర్, నరసింహారెడ్డి, శేషాద్రి నాయుడు, పూడూరు చెన్నయ్య, సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed