CCLలో 608 అప్రెంటిస్ ఖాళీలు.. నెలకు స్టైపెండ్ ఎంతంటే ?

by Harish |   ( Updated:2023-05-26 13:06:34.0  )
CCLలో 608 అప్రెంటిస్ ఖాళీలు.. నెలకు స్టైపెండ్ ఎంతంటే ?
X

దిశ, కెరీర్: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. ట్రేడ్ అప్రెంటిస్ అండ్ ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మే 24 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 608

పోస్ట్: ట్రేడ్ అప్రెంటిస్, ఫ్రెషర్ అప్రెంటిస్

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 18, 2023

పోస్టుల వివరాలు :

ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు - 536

ఫ్రెషర్ అప్రెంటిస్ ఖాళీలు - 72

స్టైపెండ్: ఎంపికైన వారికి అప్రెంటిస్ అనుసరించి రూ. 6,000, రూ. 7,000, రూ. 9,000 వరకు స్టైపెండ్ అందిస్తారు.

వయసు: ట్రేడులను అనుసరించి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు. మరికొన్ని ట్రేడులకు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసు నిర్దేశించారు.

ఎస్సీ/ఎస్టీ వారికి 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అర్హత: ట్రేడులను బట్టి నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అర్హతలుంటాయి.

అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉండాలి.

ఫ్రెషర్ అప్రెంటిస్‌లకు పదోతరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: మెరిట్ బేసిస్/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

చివరి తేదీ: జూన్ 18, 2023.

వెబ్‌సైట్: https://www.centralcoalfields.in

Advertisement

Next Story