- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫేజ్ 12 నోటిఫికేషన్ విడుదల..
దిశ, ఫీచర్స్ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ) ఫేజ్ 12 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు 18 మార్చి 2024 వరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా తప్పులు దొర్లిఉంటే మార్చి 22 నుండి మార్చి 24 వరకు సవరణలు కూడా చేసుకునే అవకాశం ఉంది.
SSC మొత్తం 2049 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల్లో లాబొరేటరీ అసిస్టెంట్, స్టాఫ్ కార్ డ్రైవర్ సహా వివిధ పోస్టులు ఉన్నాయి. SSC జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రిక్రూట్‌మెంట్ పరీక్షను మే 6 నుండి మే 8, 2024 వరకు దేశవ్యాప్తంగా నియమించబడిన కేంద్రాలలో నిర్వహించనున్నారు. పరీక్ష CBT విధానంలో నిర్వహిస్తారు.
అర్హులు..
వివిధ పోస్టులకు అర్హత, వయోపరిమితి వేర్వేరుగా నిర్ణయించారు. కొన్ని పోస్టులకు, గరిష్ట విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత, కొన్నింటికి 12వ తరగతి, అలాగే మరికొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. OBCకి కూడా గరిష్ట వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఇచ్చారు. SC, ST లకు 5 సంవత్సరాల సడలింపు ఇచ్చారు. అర్హత, వయోపరిమితికి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు SSC జారీ చేసిన నోటిఫికేషన్ ను తనిఖీ చేయవచ్చు.
దరఖాస్తు రుసుము
అభ్యర్థులు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దీనిని BHIM UPI, నెట్ బ్యాంకింగ్, మాస్టర్ కార్డ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో డిపాజిట్ చేయవచ్చు. అయితే మహిళలు, SC, ST, PWBD, మాజీ సైనికుల వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి
SSC ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి..
హోమ్ పేజీలో రిజిస్టర్ లింక్ పై క్లిక్ చేయండి.
వివరాలను పూరించి నమోదు చేసుకోండి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించి ఫీజులను జమ చేయండి.