పోస్టాఫీస్‌ ఉద్యోగాల ఫలితాలు విడుదల

by Harish |
పోస్టాఫీస్‌ ఉద్యోగాల ఫలితాలు విడుదల
X

దిశ, కెరీర్:దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో ఇండియా పోస్ట్‌ 40,889 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్‌/ ఈమెయిల్‌/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్‌ 21 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

Advertisement

Next Story