క్షీణించిన ఉద్యోగ నియామకాలు!

by Harish |
క్షీణించిన ఉద్యోగ నియామకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిఏప్రిల్‌లో ఉద్యోగ నియామకాలు 4 శాతం క్షీణించాయని ఓ నివేదిక తెలిపింది. అలాగే, ఈ ఏడాది మార్చితో పోలిస్తే 3 శాతం తగ్గాయని మాన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగ నియామకాలు పడిపోయినప్పటికీ వివిధ నగరాల్లో పలు పరిశ్రమలు పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో 50 శాతానికిపైగా నియామకాలు పుంజుకున్నాయి. ప్రధానంగా యాడ్స్, పబ్లిక్ రిలేషన్స్, మార్కెట్ రీసెర్చ్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు జరిగాయి.

కోల్‌కతాలో బీమా, బ్యాంకింగ్ వంటి రంగాల్లో 26 శాతానికిపైగా నియామకాలు వృద్ధి సాధించాయి. సమీక్షించిన నెలలో దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరులో 28 శాతం, హైదరాబాద్‌లో 23 శాతం, చెన్నైలో 16 శాతం నియామకాలు పుంజుకున్నాయి. ఇక రంగాల వారీగా చూస్తే.. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ఉద్యోగ నియామకాలు స్థిరంగా ఉన్నప్పటికీ, నిర్మాణ, స్టీల్, ఉక్కు, ఇంజనీరింగ్, రిటైల్, సిమెంట్, ఫుడ్ వంటి రంగాల్లో నియామకాలు గణనీయంగా క్షీణించాయని నివేడిక వెల్లడించింది.

Advertisement

Next Story