- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. త్వరలో 70 వేల ఉద్యోగాలు..!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం ప్రగతి భవన్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లోనే 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలిచ్చామన్నారు. కేంద్రం లాగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఏడాదికి కోటి ఉద్యోగాలను తొలగించలేదన్నారు. అయితే, తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలను ఏర్పాటుచేశామని, నూతన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను నూతన జోనల్ వ్యవస్థలో సర్ధుబాటు చేశామని, ఇప్పటి వరకు 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏ జిల్లాకి చెందిన వారు ఆయా జిల్లాల్లో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. ఉద్యోగాలిచ్చాము కాబట్టే నిరుద్యోగత రేటు తక్కువగా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయని అన్నారు.
బ్రేకింగ్.. ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తా….ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్
- Tags
- Conference
- KCR