- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్ఆర్ఆర్కు కౌంటర్‌గా ఆదివాసీల ‘జెజెజె’
దిశ, వెబ్‌డెస్క్ :
మన్నెం వీరుడు అల్లూరి, ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ కథాంశాలతో దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో ఓ కల్పిత గాథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కొమురం భీమ్‌కు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. దానిపై వివాదం నెలకొంది. ఆ టీజర్‌లో కొమురం భీమ్‌కు ముస్లింలు ధరించే టోపీ పెట్టడంపై ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీయొద్దని, ఆ సన్నివేశాలను తొలగించాలని రాజమౌళికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఆదివాసీలు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌కు కౌంటర్‌గా జెజెజె (జల్ జంగిల్ జమీన్) అనే షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు.
తిర్యాని మండలం, మోహిందా గ్రామానికి చెందిన రాయ్‌సిదం నాగోరావు దర్శకత్వంలో ‘జెజెజె’ (జల్ జంగిల్ జమీన్) అనే షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను యూట్యూబ్‌లో ఇటీవలే అప్‌లోడ్ చేయగా.. దానికి మంచి స్పందన లభిస్తోంది. రాజమౌళి తన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చూపించిన కొమురం భీమ్ వేషధారణ సరికాదని, ఆదివాసీల పోరాట యోధుడి వేషధారణ తనదైన శైలి తలపాగతో ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఆదివాసీల సంప్రదాయానికి ఆయన వేషధారణ ప్రతీక అని కూడా వివరించారు. అంతేకాదు ఆ కాలంలో గ్రాఫిక్స్ లేవని, అందుకే సహజసిద్ధంగా చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఆనాడు కొమురం భీమ్ వాడిన ఆయుధాలను తమ చిత్రంలో చూపించామన్నాడు. అసలు కొమురం భీమ్ ఎందుకు కోసం? ఎవరి కోసం పోరాటం చేశాడో చెప్పడమే తమ ఆశయమని దర్శకుడు నాగోరావు తెలిపారు.
స్నేహితులు అంతా కలిసి ఈ సినిమాను నిర్మించడం విశేషం. 15 వేల బడ్జెట్‌తో రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఆదివాసీ యువతే నటించడం విశేషం. మొత్తం సినిమా కోసం 30 మంది పనిచేశారు. కొమురం భీమ్ పాత్రలో ఆత్రం రాంచందర్ నటించగా, నిజాం ప్రభుత్వ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో అదా కృష్ణారావు నటించాడు. జెజెజె షార్ట్ ఫిల్మ్‌లోని పాట కూడా మంచి ఆదరణ దక్కించుకుంది.