- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్కదారి పట్టించేందుకే నాటకాలు.. సీఎం కేసీఆర్‌పై జితేందర్ రెడ్డి ఫైర్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ సాధించిన విజయాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రకరకాల కుట్రలు చేస్తున్నారని బీజేపీ జాతీయ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లే హుజురాబాద్ ప్రజలు అసెంబ్లీ ఉప ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పారన్నారు. ఈటల రాజేందర్ సాధించిన అద్భుత విజయాన్ని ప్రజలు చర్చించుకునే అవకాశం ఇవ్వకుండా ప్రెస్ మీట్ లు పెట్టి బీజేపీ నాయకులపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారన్నారు.
వరి కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు రూటు మార్చి రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని, ఈ అంశంలో కేంద్రాన్ని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తూ ధర్నాలకు పిలుపునిచ్చారని జితేందర్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మరోవైపు ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. దళితులకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని, దళిత బంధు అమలు చేస్తామని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. హామీలన్నింటిని మరిచారని అన్నారు. ఇక నుండి ఎటువంటి ఉపఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ చాలెంజ్ గా తీసుకొని విజయం సాధిస్తుందన్నారు. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.