స్మార్ట్‌టీవీ, ట్యాబ్లెట్ తయారీ ఆలోచనలో రిలయన్స్ జియో: నివేదిక!

by Harish |
Jio
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం జియో ఇప్పటికే పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే అతి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన కంపెనీ త్వరలో ట్యాబ్లెట్లతో పాటు స్మార్ట్‌టీవీల తయారీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దేశీయ వినియోగదారుల కోసం సరసమైన ధరలో స్మార్ట్‌టీవీలు, ట్యాబ్లెట్లను లాంచ్ చేయాలని జియో భావిస్తున్నట్టు ఓ నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లోని స్మార్ట్‌టీవీ, ట్యాబ్లెట్ల మార్కెట్లో ఎంట్రీ లెవెల్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వీటిని తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్న వాటి కంటే తక్కువ ధరకే వీటిని తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ 91 మొబైల్స్ ప్రకారం.. వచ్చే ఏడాదిలో రిలయన్స్ జియో తన స్మార్ట్‌టీవీ, ట్యాబ్లెట్లను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని, 2022 రిలయన్స్ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో వీటికి సంబంధించిన ప్రకటన ఉండొచ్చని వివరించింది. అలాగే, ఏజీఎం సమావేశంలోనే ఇంకా ఇతర కొత్త ఉత్పత్తులను రిలయన్స్ జియో విడుదల చేయనుంది.

Advertisement

Next Story