- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీ ప్లాన్‌ల ధరలు పెంచిన రిలయన్స్ జియో!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. గత నెలలోనే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను 20 శాతం మేర పెంచిన జియో తాజాగా ఓటీటీ సేవలు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇదివరకు రూ. 499 ప్లాన్ ధరను రూ. 601తో 20 శాతం పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా 3జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అదనంగా 6జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 మెసేజ్‌లు, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కి ఒక సంవత్సరం యాక్సెస్‌తో లభిస్తుంది.
అదేవిధంగా ఇదివరకు రూ. 666 ధరలో లభించే ప్లాన్‌ను రూ. 799కి పెంచింది. ఇందులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, రోజుకు 2జీ డేటా లభిస్తుంది. దీనికి 56 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక, 84 రోజుల వ్యాలిడిటీతో ఉండే రూ. 888 ప్లాన్‌ను రూ. 1,066కి పెంచుతూ జియో నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాన్‌లో 2జీబీ డేటాతో పాటు 5జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇక, 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ., 2,599 ప్లాన్‌ను రూ. 3,119కి పెంచింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అదనంగా 10జీబీ డేటా వస్తుంది. చివరగా 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ వచ్చే రూ. 549 ప్లాన్‌ను రూ. 659కి పెంచింది.