జియో న్యూ యాప్.. రిచార్జితో 4.16% కమిషన్

by Sujitha Rachapalli |
జియో న్యూ యాప్.. రిచార్జితో 4.16%  కమిషన్
X

దిశ వెబ్ డెస్క్: భారతదేశానికి చెందిన ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ రిలయన్స్ జియో తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త ‘జియో పీవోఎస్ లైట్’ కమ్యూనిటీ రీఛార్జ్ యాప్‌ను విడుదల చేసినట్లు జియో ప్రకటించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో జియోపీవోఎస్ లైట్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదని తెలిపింది.

జియో కస్టమర్లు అదనంగా డబ్బు పొందే మార్గం. ఎలా అంటే..

ఏ యూజర్ అయినా జియో పీఓస్ లైట్ యాప్ ద్వారా ఇతర జియో కస్టమర్ల ఖాతాలను రీఛార్జ్ చేసి 4.16 శాతం కమీషన్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ యాప్ ప్రస్తుతం అండ్రాయడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మొదటగా జియో నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జియో వ్యాలెట్ లోకి .. బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ బదిలీ చేసుకోవాలి. వ్యాలెట్ లోని మనీతో రిచార్జ్ చేస్తేనే కమిషన్ వస్తుంది. అందుబాటులో ఉన్న ప్లాన్లను ఉపయోగించి ఇతరులకు రిచార్జి చేయొచ్చు. యాప్ లోని పాస్ బుక్ లో.. రిచార్జీ హిస్టరీ చూసుకోవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో రీచార్జి చేయడంలో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

Tags: lockdown, jio, pos lite, new app, recharge , commission

Advertisement

Next Story

Most Viewed