కరోనా ఎఫెక్ట్.. జియో, బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

by srinivas |
కరోనా ఎఫెక్ట్.. జియో, బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్
X

కరోనా వైరస్ దేశాన్ని ఆందోళనలో పడేసిన వేళ.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వర్క్ ఫ్రం హోంకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగులను స్వస్థలాలకు వెళ్లి పనిచేయాలని సూచించాయి. ఇంకొన్ని సంస్థలు ఇంటికే పరిమితమవ్వాలని, మౌలిక సదుపాయాలు లేని ఉద్యోగులకు వాటిని కల్పిస్తూ విధులకు ఆటంకం కలుగకుండా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోంకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ప్రముఖ టెలికాం సంస్థలు జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలు సరికొత్త ఆఫర్లలో జనం ముందుకు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ పేరిట జియో డేటాను అందుబాటులోకి తెచ్చింది. దీని కాలపరిమితి 51 రోజులుగా కాగా, దీని ధర 251 రూపాయలు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు 2 జీబీ డేటా పొందవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్, మెసేజింగ్ చేసుకోవడం కుదరదు.

మరోవైపు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే తరహాలో వర్క్ ఫ్రమ్ హోం ఆఫర్ తీసుకొచ్చింది. అయితే ఆ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లను ఉద్దేశించి మాత్రమే అమలు చేయడం విశేషం. దీని కాల పరిమితి కేవలం నెలరోజులే. అది కూడా కేవలం బ్రాడ్ బ్యాండ్ సర్వీసు మత్రమే ఉచితమని స్పష్టం చేసింది.

Tags: telco industries, data plans, work from home, coronavirus, jio, bsnl

Next Story