- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం సంచలన వ్యాఖ్యలు.. కరోనా కట్టడికి ఆర్మీని దింపాల్సిందే
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ముఖ్యంగా జార్ఖండ్ రాష్ట్రంలో ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆర్మీని రంగంలోకి దించాల్సిందే అని సోరేన్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే తాను ఎన్నికల ప్రచారం ముగించుకుని రాష్ట్రానికి వచ్చానని.. ఇక్కడి ప్రజలను చూసి తాను ఆశ్చర్యపోయినట్టు సోరేన్ అన్నారు. కేసులు ఇంతలా పెరుగుతున్నా.. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు లేకుండా ప్రజలు బయట తిరుగుతున్నారు. ఇలా అయితే కరోనా కట్టడికి అదనపు బలగాలు దించడమే మార్గమన్నారు.
Next Story