ఎమ్మెల్యే పర్యటన ఏర్పాట్లలో బుల్లెట్ల వర్షం.. జవాన్ మృతి

by Sridhar Babu |   ( Updated:2021-07-20 04:21:11.0  )
army
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ మృతిచెందగా, మరో వ్యక్తి గాయపడ్డారు. నారాయణపూర్ ఎమ్మెల్యే చందన్ కశ్యప్ పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఐటీబీటీ 45వ బెటాలియన్ జవాన్ల బృందం వెళ్ళి పర్యటన మార్గంలో శోధిస్తున్నారు. ఆ క్రమంలో డోంగేర్ గుట్టల వైపు వెళ్ళే మలుపు వద్ద జవాన్లపై మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. జవాన్లు తేరుకొని ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు దట్టమైన అడవిలోకి పారిపోయారు. మావోయిస్టుల కాల్పుల్లో ఐటీబీపీ జవాన్ ఒకరు మృతి చెందినట్లు ఏఎస్‌పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు. గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed