- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీటీడీ ఈవోగా జవహర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ కార్యనిర్వహణాధికారిగా కేఎస్. జవహర్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఏవీ ధర్మారెడ్డి నూతన ఈవోకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్య కార్యదర్శిగా కేఎస్ జవహర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన ఈవో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ధర్మారెడ్డి కొత్త ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ స్వామివారిని నూతన ఈవో దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఉదయం అలిపిరి మార్గంలో కాలినడకన జవహర్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని జవహర్‌రెడ్డి చెప్పారు.