సన్‌రైజర్స్‌కి బూస్ట్.. జట్టులోకి ఇంగ్లీష్ ఓపెనర్

by Anukaran |
సన్‌రైజర్స్‌కి బూస్ట్.. జట్టులోకి ఇంగ్లీష్ ఓపెనర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ సీజన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ప్రకటించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. బయో బబుల్ జీవితంలో అలసిపోయానని, అందుకే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు మిచెల్ ప్రకటించాడు. కీలక ఆటగాడు తప్పుకోవడంతో SRHకి షాక్ తగిలినట్లయింది.

https://twitter.com/SunRisers/status/1377241409804062720

ఈ క్రమంలో SRH అభిమానులకు బూస్ట్ ఇచ్చే ఒక వార్త బయటికొచ్చింది. మిచెల్ మార్ష్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను SRH జట్టులోకి తీసుకుంది. టీ20ల్లో జేసన్ రాయ్‌కి మంచి రికార్డులు ఉన్నాయి. ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా జేసన్ రాయ్ అద్భుతంగా రాణించాడు. అతడు జట్టులోకి రావడం SRHకి కలిసొస్తుందని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed