- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై జట్టులోకి ఆస్ట్రేలియా పేసర్
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జోష్ హాజెల్‌వుడ్ ఆ జట్టుకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల రిత్యా తాను ఈ సీజన్ ఆడలేనని యాజమాన్యానికి తెలిపాడు. దీంతో ఆ రోజు నుంచి మరో బౌలర్ కోసం సీఎస్కే వెతుకుతున్నది. ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టోప్లేను సంప్రదించినా అతడు ఆసక్తి కనబర్చలేదు. చివరకు ఆస్ట్రేలియాకు చెందిన జేసన్ బెరెండార్ఫ్‌ను జట్టులోకి తీసుకున్నది. ఈ విషయాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బెరెండార్ఫ్ 5 మ్యాచ్‌లలో 5 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో ఏ జట్టూ అతడిని తీసుకోలేదు. తాజాగా సీఎస్కే జట్టుతో భాగస్వామ్యం అయ్యాడు. ఆస్ట్రేలియా తరపున 11 అంతర్జాతీయ వన్డేల్లో 16 వికెట్లు, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, లుంగి ఎన్‌గిడితో పాటు బెరెండార్ఫ్ పేసర్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. శనివారం చెన్నై తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడనున్నది.