- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్‌కు మరిన్ని అవాంతరాలు
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలింపిక్స్ 2020కి మరో 50 రోజుల గడువే ఉన్నది. ప్రపంచమంతా కరోనా సెకెండ్ వేవ్ బారిన పడి ప్రమాదరకంగా ఉన్న సమయంలో జపాన్‌లో ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ), టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీ, జపాన్ ప్రభుత్వం ఈ మెగా క్రీడలను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాయి. కానీ రోజు రోజుకూ అవాంతరాలు ఎదురవుతుండటంతో సక్రమంగా జరుగుతాయా లేదా అనే సిందిగ్దత నెలకొన్నది. ఇప్పటికే టోక్యో సహా జపాన్‌లోని ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీని జూన్ 20 వరకు పొడిగించారు. ఒలింపిక్స్‌పై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే ఎమర్జెన్సీ తర్వాతే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒలింపిక్స్ జరిగితే కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చే అవకాశం ఉన్నదని.. కాబట్టి వెంటనే రద్దు చేయాలని గత వారంలో జపాన్ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. వీరితో పాటు ప్రతిపక్షాలు, స్వచ్చంద సేవా సంస్థలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేస్తున్నాయి. అయినా సరే జపాన్ ప్రభుత్వం మాత్రం ఒలింపిక్స్‌పై ముందుకే వెళ్లడానికే మొగ్గు చూపుతున్నది.
పరిస్థితి అసాధారణమే..
ప్రస్తుతం జపాన్‌లో పరిస్థితి సాధారణంగా ఏమీ లేదని.. ఇప్పటికీ కరోనా వైరస్ ప్రమాదం తీవ్రంగా ఉన్నదని కొవిడ్-19 సలహాదారుడు షిగెరు ఓమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఇలాంటి సమయంలో దేశవిదేశాల నుంచి వచ్చే వారితో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న షిగెరు టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీకి కూడా పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్ కోసం కఠినమైన ఆంక్షలు విధించడమే కాకుండా వైరస్ బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేవారు. ఇక జపాన్‌లోని పరిస్థితిని చూసి 10 వేల మంది వలంటీర్లు ఒలింపిక్స్ పనుల నుంచి తప్పుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో వలంటీర్లుగా పని చేయడానికి దాదాపు 2 లక్షల మంది వలంటీర్లుగా నమోదు చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా వీరిలో చాలా మంది ఇప్పటికే తప్పుకోగా.. వలంటీర్లు సంఖ్యను 80 వేలకు కుదించాలని నిర్వాహక కమిటీ గత నెలలో నిర్ణయించింది. తాజాగా ఆ 80 వేల మందిలో 10 వేల మంది తాము ఒలింపిక్స్‌కు రాబోమని తేల్చి చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహణలో వలంటీర్లది కీలక పాత్ర. ఇప్పటికే వలంటీర్ల సంఖ్యను 2 లక్షల నుంచి 80 వేలకు తగ్గించగా.. తాజాగా వారి సంఖ్య 70 వేలకు పడిపోవడం నిర్వాహక కమిటీని ఆందోళనలో పడేసింది.
అథ్లెట్‌కు కరోనా..
జపాన్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి వచ్చిన ఘనా ఫుట్‌బాల్ ప్లేయర్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం అతడు ఒలింపిక్స్ కోసం ఇక్కడే ఉండాల్సి ఉన్నది. అయితే గురువారం జపాన్ చేరుకున్న వెంటనే అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా ఉన్నట్లు గుర్తించినట్లు జపాన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే జపాన్‌లో జమైకా ఫుట్‌బాల్ ఆడటానికి రావల్సి ఉండగా.. కరోనా టెస్టింగ్స్‌కు సంబంధించిన వివాదంలో మ్యాచ్‌లు రద్దు చేశారు. అది జరిగిన రెండు రోజులకే కరోనా కేసు బయటపడింది. దీంతో ఆ ఫుట్‌బాలర్‌ను ఐసోలేషన్‌కు పంపి మిగిలిన ఆటగాళ్లు సిబ్బందిని వేరే చోట క్వారంటైన్ చేశారు. ఒక జట్టు వస్తేనే కరోనా కేసులు బయటపడితే.. ప్రపంచ వ్యాప్తంగా 10 వేల మంది క్రీడాకారులు టోక్యో చేరుకుంటే పరిస్థితి ఏంటని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
మేం తప్పుకుంటాం : స్పాన్సర్స్
టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయా లేదా.. జరిగినా ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనే సందిగ్దత ఉండటంతో తాము స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంటామని అసాహి అనే బేవరేజెస్ కంపెనీ హెచ్చరించింది. టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా స్టేడియంలలో బీర్, వైన్, నాన్-ఆల్కహాలిక్ బేవరేజెస్ అమ్మడానికి అసాహి కంపెనీ హక్కులు దక్కించుకుంది. ఈ కంపెనీ ‘సూపర్ డ్రై’ పేరుతో బీరు అమ్మాలని ప్లాన్ చేసింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులను అనుమతించక పోతే తాము స్పాన్సర్‌గా ఉండటం అనవసరం అని భావిస్తున్నది. ప్రభుత్వం ప్రేక్షకులను అనుమతించినా.. ఆల్కహాల్ ప్రొడక్ట్స్ స్టేడియంలలో నిషేధించే అవకాశం ఉన్నందున.. భారీ నష్టం వాటిల్లుతుందని అసాహి సంస్థ భావిస్తున్నది.