- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ‘కలెక్టర్’ గారు.. మీకు రూల్స్ వర్తించవా.?
దిశ, జనగామ : ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన కలెక్టర్ల కార్లకు నిబంధనలు వర్తించవా.. నిబంధనలు సామాన్యులకేనా అంటూ పలువురు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే ఈవార్త చదవాల్సిందే.. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి 2 సంవత్సరాల్లో (గత నెల ఆగస్టు 30వ తేది వరకు) ఏకంగా 23 సార్లు అతివేగంతో రోడ్డు భద్రతా రూల్స్ ఉల్లఘించడంతో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు.
వీటిలో 22,100 అసలు జరిమానా ఉండగా 805 యూజర్ చార్జెస్ కలుపుకుని 22,905 వేలు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ, ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోవడం బాగుందని, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్, ప్రజాప్రతినిధుల కార్ల పెండింగ్ చలాన్లపై ఎందుకు చర్యలు తీసుకోరని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సామాన్యులు చెల్లించకుంటే వాహనాలు పట్టుకుని ఇబ్బందులకు గురిచేసే పోలీసులు.. కలెక్టర్ వాహనంపై చర్యలు ఎందుకు తీసుకోరని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి అధికారుల వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని, నియమ నిబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.