ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడిపై కేసీఆర్ కోర్టుకు వెళ్లాలి: నాగం

by Shyam |
ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడిపై కేసీఆర్ కోర్టుకు వెళ్లాలి: నాగం
X

దిశ, న్యూస్‌ బ్యూరో: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు మళ్లించుకపోతే తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జూరాల నీళ్లు ఏపీకి ఏమైనా రాసిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారంపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోన్న నీళ్ల దోపిడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఆకలితో అల్లాడిపోతుంటే వారిని ఆదుకోకుండా ప్రాజెక్టులకు టెండర్లు పిలువడం సిగ్గుమాలిన వ్యవహారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం మూడో టీఎమ్‌సీ టెండర్లు రద్దు చేయాలన్నారు. సీతా రామ ప్రాజెక్టు కోసం మళ్లీ రూ.1200 కోట్ల టెండర్లు పిలిచి సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు.

Tags: projects, Kalesvaram, seetharama, potireddy, tenders, all parties, janardhan, kcr

Advertisement

Next Story

Most Viewed