జామియా విద్యార్థులపై పోలీసుల దాడి వీడియో

by Shamantha N |
జామియా విద్యార్థులపై పోలీసుల దాడి వీడియో
X

జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు రెండు నెలల కింద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ప్రదర్శన తర్వాత జరిగిన హింసకు సంబంధించిన మరో వీడియో ముందుకొచ్చింది. వర్సిటీ అల్యూమ్నీ, విద్యార్థుల బృందం జామియా కోఆర్డినేషన్ కమిటీ విడుదల తాజాగా ఈ వీడియోను విడుదల చేసింది. లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. వర్సిటీ ఓల్డ్ రీడింగ్ హాల్‌లోకి పోలీసులు దూసుకురాగా.. కొందరు విద్యార్థులు భయపడుతూ బయటకు పరుగులు తీశారు. ఇంకొందరు డెస్క్‌ల కింద నక్కేందుకు యత్నించినా.. కనిపించినవారిని కనిపించినట్టుగా పోలీసులు బాదినట్టు వీడియో వివరిస్తున్నది. కాగా, ఈ వీడియోను ఉటంకిస్తూ కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. లైబ్రరీలోకి వెళ్లలేదని, విద్యార్థులను బాదలేదని కేంద్ర హోం మంత్రి(అమిత్ షా), ఢిల్లీ పోలీసులు బాహాటంగా అబద్ధమాడారని ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. బాధ్యులైన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వ అసలు రూపం వెల్లడవుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed