టీపీసీసీ నాకే ఇవ్వాలి -జగ్గారెడ్డి

by Shyam |   ( Updated:2020-02-15 06:06:07.0  )
టీపీసీసీ నాకే ఇవ్వాలి -జగ్గారెడ్డి
X

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒకవేళ మార్పు తప్పదంటే ఆ పదవి తనకే ఇవ్వాలని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని అధికారంలోని తెచ్చే మెడిసిన్ తన వద్ద ఉందన్నారు. పీసీసీ పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. సంగారెడ్డిలో 60 అడుగుల జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed