- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ, తెలంగాణను కలిపితే మద్దతిస్తా.. జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతా అంటే తాను మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, తన స్టాండ్ కూడా సమైక్య రాష్ట్రమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ మంత్రి నాని కూడా అన్నారన్నారు. అంసెబ్లీ హాల్లో శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన రాజకీయ చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆరే స్టార్ట్ చేశారనడంలో అనుమానం లేదని, ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ అని, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో అన్ని పార్టీలు తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేశాయన్నారు.
సమైక్య రాష్ట్రం పేరు మీద ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు కొత్త డ్రామా మొదలుపెట్టాయని, కేసీఆర్ రాజకీయాలను ప్రజలు గమనించాలని జగ్గారెడ్డి కోరారు. ఇక వైఎస్ షర్మిల తెలంగాణలో స్పేస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలో తాము కూడా తెలంగాణ కొడుకని టీడీపీ నుంచి లోకేశ్, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వారసులు వచ్చినా అశ్చర్యపోనవసరం లేదన్నారు. తనది ముందు నుంచీ సమైక్య రాష్ట్రమేనని, తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దని పీసీసీలో ఎక్కడా లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అడ్డుకునే అర్హత రేవంత్ కు లేదన్నారు. తాను ఎప్పటికైనా రేవంత్‌రెడ్డికి క్షమాపణ చెప్పనని, చెప్పే పరిస్థితి కూడా రాదన్నారు. గతంలోనూ కేవలం మాణిక్కం ఠాగూర్‌కు మాత్రమే క్షమాపణ చెప్పానన్నారు.