- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగనన్న తోడుకు అర్హతలివే..!
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నుంచి అన్ని రంగాలు కుంటుపడిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ వివిధ రంగాలు పూర్తి స్థాయి కార్యకలాపాలు కొనసాగడం లేదు. ఈ ప్రభావం చిరువ్యాపారులపై తీవ్రంగా పడింది. దీంతో వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న తోడు’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలైంది. ఈనెల 16న దీనికి సంబంధించిన సర్వే ముగియనుంది. ఈనెల 23లోగా ఈ పథకానికి అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది.
ఈ పథకానికి చిరు వ్యాపారులంతా అర్హులే.. తోపుడు బండ్లు, సైకిల్, వాహనాలపై వస్తువులను అమ్మేవారు, ఫుట్ పాత్ లపై వ్యాపారాలు చేసుకునేవారు, కొయ్యబొమ్మలు, హస్తకళలపై ఆధారపడేవారందరికీ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందించనుంది. ఒక్కొక్క లబ్ధిదారుడికి 10 వేల రూపాయల చొప్పున లోన్ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి ఈ పథకం వర్తించనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ పథకం వర్తించేందుకు నాలుగు ప్రధాన అర్హతలను ప్రభుత్వం విధించింది. దీని ప్రకారం లబ్ధిదారులకు ఉండాల్సిన
అర్హతలు ఏంటంటే…
* దరఖాస్తుదారుడి వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి.
నెలవారీ ఆదాయం పట్టణాల్లో అయితే 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
* గ్రామాల్లో నెలవారీ ఆదాయం 10 వేల రూపాయల్లోపు ఉండాలి.
* చిరు వ్యాపారికి మాగాణి (3 ఎకరాల లోపు), మెట్టభూములు కలిపి 10 ఎకరాలకు మించకూడదు.
* 5 చదరపు అడుగుల స్థలం లేదా అంతకన్నా తక్కువ స్థలంలో వ్యాపారాలు చేస్తుండాలని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. ఇలా వ్యాపారం చేసేవారందరికీ ప్రభుత్వం లోన్ ఇవ్వనుంది.