- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ సర్కార్ యూటర్న్.. మరో జీవో వెనక్కి..
దిశ, ఏపీ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం మళ్లీ యూటర్న్ బాట పట్టింది. ఇటీవల మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గిన జగన్ సర్కార్ తాజాగా మరో కీలక విషయంలోనూ యూ యూటర్న్ తీసుకుంది. గ్రామ సచివాలయాల్లోని మహిళా కార్యదర్శులను కానిస్టేబుళ్లుగా మారుస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 59ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అలాగే యూనిఫాం విషయంలో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. సచివాలయ మహిళా కార్యదర్శులను పోలీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో పై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం జీవో నెం. 59ను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అలాగే యూనిఫాం విషయంలో కూడా వెనక్కి తగ్గినట్లు స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పిస్తామని, అందుకు వారం రోజులు గడువు ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వారం రోజుల పాటు విచారణను వాయిదా వేసింది.
- Tags
- high court
- Jagan