- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ ఉద్యోగుల గురించి జగన్ ఏమన్నాడంటే..?
దిశ, ఏపీ బ్యూరో: ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు తీరుతాయని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆప్కోస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్ సర్వీసెస్) ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు, సమస్యల గురించి తెలుసుకున్నానని అన్నారు. అందుకే వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
గతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారని, కానీ ఆ వ్యవస్థను మార్చి నియామకాల్లో పారదర్శకత తీసుకురావాలనే ఆప్కోస్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకపై ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరికీ లంచాలు ఇవ్వనవసరంలేదని జగన్ తెలిపారు. 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీ, మహిళలకే ఇస్తామని ఆయన ప్రకటించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు ఆప్కోస్ చైర్మన్‌లు గా ఉండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులుగా నియమితులైన వారికి ప్రతి నెల 1వ తేదీన ‘అప్కోస్’ (ఏపీసీఓఎస్) ద్వారా జీతాలు చెల్లించడం జరుగుతుందని ఆయన మాటిచ్చారు. తద్వారా లంచాలు, కమీషన్ కు తావులేకుండా ఉద్యోగికి నేరుగా పూర్తి జీతం చేతికి అందుతుందని సీఎం తెలిపారు.