- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడు.. మంత్రి హాట్ కామెంట్స్
దిశ ప్రతినిధి, నల్లగొండ: రేవంత్ రెడ్డి ఓ పగటి వేషగాడని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలను ప్రజలు విశ్వసించబోరని, ‘ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టు’ ప్రతిపక్షాల పరిస్థితి ఉందన్నారు. యావత్ తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు ఏనాడూ ప్రజల గురించి పట్టించుకోలేదని, పక్క రాష్ట్రం ఏపీకి లాభం చేసేలా ప్రతిపక్షాలు వ్యవహరించాయని, వాటిని ప్రజలు గమనించారన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మబోరని, ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. జలదోపిడి చేస్తూ నీతులు మాట్లాడుతున్నారని, పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం 203 జీఓను వెనక్కి తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారని, ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఫలితం ఉండదన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు ఎలాంటి నష్టం కానివ్వరని గుర్తు చేశారు